Beauty Tips

White Hair:ఈ నూనెతో తెల్ల జుట్టు కేవలం 7 రోజుల్లో నల్లగా మారడం ఖాయం!

White Hair To Turn Black: ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. అలా చిన్న వయస్సులోనే రావటంతో మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

కొబ్బరి నూనె తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే హెన్నా జుట్టుకు సహజసిద్ధమైన రంగును ఇస్తుంది. ఐదు స్పూన్ల కొబ్బరి నూనెను ఒక బౌల్లో వేసి బాగా మరిగించాలి.

అందులో ఒక స్పూన్ గోరింటాకు పొడిని వేసి బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేసి గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంటయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుంది.

కొబ్బరి నూనె, ఉసిరికాయ మిశ్రమం కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.

నాలుగు స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఒక గంట అయ్యాక ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.