Winter Food:చలి కాలంలో దగ్గు జలుబు తో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ ఆహారాలు తప్పనిసరి
Winter Food:ఈ చలికాలంలో చలి కారణంగా దగ్గు జలుబు వంటివి కూడా వచ్చేస్తాయి. దగ్గు జలుబు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. మందులు వేసుకున్న ఒక వారం రోజులపాటు వేధిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్ళకుండా ఇంటిలో ఉండే వస్తువులతో దగ్గు జలుబు నుండి బయటపడవచ్చు.
పసుపు పాలు తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఓట్స్, బ్రౌన్ రైస్ వంటివి తీసుకుంటే మన శరీరంలో వేడిని తగ్గించడం కాకుండా రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే వాము, తులసి, వెల్లుల్లి వంటి వాటిని రెగ్యులర్గా ఆహారంలో తీసుకోవాలి.
దగ్గు జలుబు వస్తున్నాయి అనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా ఆవిరి పట్టుకోవాలి. ఆవిరి పెట్టుకునే నీటిలో పసుపు, విక్స్ వేసుకోవాలి. ముక్కు దిబ్బడ గా ఉన్నా కూడా ఇలా ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గి శ్వాస బాగా ఆడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.