Beauty Tips

Hair Care Tips:జుట్టు రాలకుండా ఒత్తుగా,నల్లగా పెరగాలంటే….

HAir Care Tips:బొప్పాయి గుజ్జుకి ఒక కప్పు పెరుగు కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తుంటే జుట్టు చివరలు చిట్లకుండా ఉంటాయి.

ఒక స్పూన్ ముల్టానా మిట్టిలో ఒక స్పూన్ పెరుగు,కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ జుట్టుకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య తొలగిపోతుంది.

ఉల్లి రసంను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలు లేదా తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య తొలగిపోతాయి.

జుట్టు రాలకుండా ఒత్తుగా,నల్లగా పెరగాలంటే పచ్చి ధనియాల రసాన్ని తలకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,నల్లగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.