MoviesTollywood news in telugu

అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చాక ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?

Allu Arjun net worth and assets :గంగోత్రి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన నటనతో జనాన్ని ఆకట్టుకుని,స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. స్టైల్ ని ఓ కొత్త తరహాలో పరిచయం చేసాడు. సౌత్ ఇండియాలో ఎక్కువ ఫాలోవర్స్ గల నటుడు ఇతడే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటన,పాటలు,ఫైట్స్ తో జనంలో తనకంటూ ఓ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.

తెలుగులో ఇప్పటివరకూ 20సినిమాలు పైనే నటించి తాజాగా ఈ సంక్రాంతికి అలవైకుంఠపురంలో మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ అందుకున్నాడు. తనకు వచ్చే ఆదాయంలో ఎక్కువగా ఫౌండేషన్స్ ద్వారా పేద విద్యార్థులకు అందజేస్తున్నాడు. చదువుతో పాటు,వైద్య సమస్యలకు సహాయం పడేలా తనవంతు కృషి చేస్తున్నాడు.

అయితే బన్నీ ఎంత సంపాదిస్తాడు,ఒక్కొక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత ,ఆస్తి విలువ ఎంత వంటి విషయాల్లోకి వెళ్తే,ఇతడి ఆస్తి దాదాపు 354 కోట్లట.

అల్లు అర్జున్ దగ్గర ఉన్న కార్లు
* రేంజ్ రోవర్
* హమ్మర్ H2
* జాగ్వార్ XJ L
* వోల్వో XC90 T8 ఎక్సలెన్స్
* మెర్సిడెస్ GLE 350d
* BMW X6m
* ఫాల్కన్ వానిటీ వాన్

అల్లు అర్జున్ స్థిరాస్తులు

* నార్సింగిలోని అల్లు స్టూడియోస్
* అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ [ప్రొడక్షన్ హౌస్]
* ఆశీర్వాదం [ఫాంహౌస్]
* జూబ్లీహిల్స్‌లో ఒక విలాసవంతమైన భవనం