MoviesTollywood news in telugu

Heroines remuneration:ఈ సంవత్సరం హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..!

Tollywood Heroines remuneration:ఈ మధ్య హీరోయిన్ ల పారితోషికాలు భారీగానే పెరిగాయి. దక్షిణ భారతదేశంలో స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ లో కూడా తమ హవాను కొనసాగిస్తూ సక్సెస్ ని అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.

యానిమల్ సినిమాతో రష్మిక, జవాన్ తో నయనతార బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. సిటాడెల్ సిరీస్ తో సమంత సిద్ధమైంది. త్రిష, కీర్తి సురేష్, సాయిపల్లవి లాంటివారు కూడా పారితోషికాన్ని భారీగా తీసుకుంటున్నారు.

సిటాడెల్, చెన్నై స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సమంతా ఒక్కో సినిమాకు దాదాపుగా 4 కోట్ల రూపాయిలను రెమ్యునరేషన్ గా తీసుకుంటుంది. తమిళంలో స్టార్ హీరోయిన్ నయనతార హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నయనతార ఈ సినిమాలో నటించినందుకు 10 కోట్ల పారితోషికం తీసుకుంది.

త్రిష ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు తీసుకుంటోంది. తమన్నా రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తోంది. కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటోంది. హీరోయిన్ల రెమ్యునరేషన్ జాబితా పరిశీలిస్తే.. వీరందరిలో నయనతార టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. స్టార్ హీరోకు సమానంగా ఆమె పారితోషికం ఉంటుంది. జవాన్ తర్వాత పారితోషికాన్ని రూ.12 కోట్లకు పెంచినట్టు తెలుస్తుంది.