Weight Loss Tips:ఉదయాన్నే నిమ్మరసం తీసుకుంటే బరువు తగ్గుతారా?
ఉదయాన్ని మనం ఒక కప్ టీతోనో లేక ఒక కప్ కాఫీతోనో డే స్టార్ట్ చేస్తాం. ఉదయాన్నే ఇవి తాగితే నిద్ర మథు వదిలి ఉల్లాసంగా డే స్టార్ట్ అవుతుంది. కానీ శరీరానికి మేలు చేసే ఇంతకంటే మంచి డ్రింక్స్ కూడా ఉన్నాయి. అవునండి… గోరువెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలిపి తాగితే శరీరానికి చాలా ఉపయోగం ఉంటుంది.
దీనివల్ల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వేడి నిమ్మ రసం కాలి కడుపున త్రాగడం వలన గాస్ట్రో సిస్టం మెరుగు పడుతుంది. దీనివలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది.
తద్వారా, ఓవర్ అల్ హెల్త్ మెరుగు పడడం తో పాటుగా, వ్యాదులకు దూరంగా ఉండవచ్చు కూడా. అంతేకాకుండా నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ఫైబర్ పదార్థం కారణంగా ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఒక దివ్య ఔషదం.
దీంతో మెటబాలిజం కూడా మెరుగు పడి ఆకలి నియంత్రణకు దారి తీస్తుంది. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తీసుకుంటే కడుపు కాళీ అయి ప్రశాంతతను కలిగింస్తుంది. దీనివల్ల అల్సర్, ఉబ్బటం, అలజడి లాంటివి రాకుండా చేయడంలో కూడా నిమ్మరసం తోడ్పడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.