Kitchenvantalu

Gongura Puvvu Pachadi:ఓ సారి గోంగూర పువ్వుల పచ్చడి ఇలా చేసి చూడండి.. చాలా రుచిగా ఉంటుంది

Gongura Puvvu Pachadi:గోంగుర పువ్వు పచ్చడి.ఆంధ్ర ఫేమస్ గోంగుర పచ్చడి అంటే పడి చచ్చిపోతారు.గోంగుర పువ్వుతో పచ్చడి ఎప్పుడైనా టేస్ట్ చేసారా.పువ్వు రుచి కూడ అదిరిపోతుంది ఈ సారి ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
గోంగుర పువ్వులు – పిడికెడు
పచ్చిమిర్చి – రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు – 7-8
మెంతులు – ¼ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
నువ్వులు – 1 టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
తాలింపులు – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.గోంగుర పువ్వులను కొనలను తొక్క తీసేసి పూలను శుభ్రంగా వలిచి పక్కన పెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి జీలకర్ర,మెంతులు,ధనియాలు,నువ్వులు,వేసి వేపుకోవాలి.
3.అందులోకి తరిగిన పచ్చిమిర్చి,గోంగుర పూలను వేసి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
4.అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5.మిక్సి జార్ లోకి చల్లారిన పదార్ధాలు, ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి తాలింపు గింజలు,ఎండు మిర్చి ,కరివేపాకు,పసుపు, వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు వేగిన తాలింపు లోకి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి కలుపుకోవాలి.
8.అంతే పుల్ల పుల్లని గోంగుల పువ్వు పచ్చడి రెడీ.