ఈగ సినిమాతో జక్కన్న మెస్మరైజ్ ఎలా చేసాడో తెలుసా…నమ్మలేని నిజాలు
స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొదలైన ప్రస్థానం బాహుబలితో వరల్డ్ లెవెల్ కి చేరుకున్న దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఏది చేసినా పక్కాగా చేస్తాడు.
జక్కన్న తీసిన సినిమాల్లో ఇప్పటికీ మెస్మరైజ్ చేసే సినిమా ఈగ అని చెప్పాలి. రామ్ చరణ్ తో మగధీర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న నుంచి ఏ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్న సమయంలో తీసిన ఈగ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.
గ్రాఫిక్ మాయాజాలంతో నడిచిన ఈగ సినిమాలో విలన్ గా సుదీప్ నటించగా, హీరోగా నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ గా సమంత నటించారు. అయితే హీరో ని విలన్ చంపేస్తే,అతడు ఈగ రూపంలో జన్మించి పగ తీర్చుకోవడం ఇతివృత్తాన్ని చక్కగా మలిచాడు జక్కన్న.
ఈ సినిమా తర్వాత జక్కన్న కోసం చాలామంది ప్రొడ్యూసర్స్ బ్లాంక్ చెక్కులతో సినిమా తీయాలని తిరిగారంటే అతడి ప్రతిభ ఏ రేంజ్ లో ఉందొ చెప్పొచ్చు. ఈ సినిమా మొదటి రెండు రోజులు ఏమాత్రం కలెక్షన్స్ లేకపోవడంతో అందరూ పెట్టుకున్న బెంగ ఆతరువాత తీరిపోయింది.
నాని,సమంత ఫాన్స్ కి అయితే అప్పట్లో పెద్ద గా కలెక్షన్స్ వచ్చేస్థితి లేదు. కానీ, ఒక్క ఈగతో చేసిన మెస్మరైజ్ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. ఇక కీరవాణి ట్యూన్స్ షరా మూములే. ఓ కొత్త లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కల్పించి ఈగతో ఆడియన్స్ మనసు దోచిన జక్కన్న ఎలాంటి సినిమా తీసినా తిరుగులేదన్న గ్యారంటీ మరింత పెంచుకున్నాడు.