Kitchenvantalu

Telangana Special Sarva Pindi:తెలంగాణ ఫేమస్ వంటకం సర్వపిండి.. ఇలా చేస్తే టేస్టు అదిరిపోతుంది

Telangana Special Sarva Pindi: సర్వ పిండి..తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలా రుచిగా ఉంటుంది.ఈవినింగ్ స్నాక్స్ గా తయారు చేసుకునే సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 2 కప్పులు
ఉల్లిపాయ – 1
జీలకర్ర – ½ టీ స్పూన్
పచ్చిమిర్చి – 4
వెల్లుల్లి రెబ్బలు – 4
కొత్తిమీర – చిన్న కట్ట
ఉప్పు –రుచికి సరిపడా
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.ముందుగా మిక్సి జార్ లోకి పచ్చిమిర్చి ,ఉల్లిపాయలు,జీలకర్ర,వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర,ఉప్పువేసి గ్రైండ్ చేసుకోవాలి.
2.ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక కప్పు నీళ్లను వేసి శనగపప్పు ,జీలకర్ర,నవ్వులు,గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి నీళ్లను మరిగించుకోవాలి.
3.మరిగే నీళ్లలోకి బియ్యం పిండిని వేసి కలుపుకోని మిశ్రమాన్ని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
4. అవసరం అయినన్ని నీళ్లను ఆయడ్ చేస్తు పిండి ముద్దలా కలుపుకోవాలి.

5.ఇప్పుడు మందపాటి అడుగువున్న ప్యాన్ లోకి ఆయిల్ వేసి పిండి ముద్దను గిన్నె అడుగు బాగానికి వత్తుకోవాలి.
6.వత్తుకున్న ప్యాన్ ని స్టవ్ పై పెట్టుకోని 8-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పై సర్వపిండిని కాల్చుకోవాలి.
7.మద్య మధ్యలో చెక్ చేసుకోవాలి.
8.సర్వపిండి పూర్తి ఎర్రగా కాలాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
9.అంతే సర్వపిండి రెసిపీ రెడీ.