Kitchenvantalu

Chintakaya Charu:నోటికి పుల్లగా, కారంగా భలే రుచిగా ఉండే చింతకాయ చారు..

Chintakaya Charu:చింతకాయ చారు..సీజన్ లో దొరికే పచ్చిచింతకాయలతో చారు చాలా రుచిగా ఉంటుంది.సంక్రాంతి సమయంలో చింతకాయలతో చాలా రెసిపిస్ చేస్తుంటారు.అందులో చింతకాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
చింతకాయలు – 200 గ్రాములు
పచ్చిమిర్చి – 10
కరివేపాకు – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
ఎందుమిర్చి – 5
జీలకర్ర – 1 టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర మెంతుల పొడి – ¼ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
ఉల్లిపాయ – 1
మునక్కడాలు -1
ఉప్పు – తగినంత
బియ్యం పిండి – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా చింతకాయలను ఉడికించుకోవాలి.పగుల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
2.ఇప్పుడు మసాలా కోసం మిక్సి జార్ లో పచ్చిమిర్చి,కొత్తిమీర ,ఉప్పు,జీలకర్ర వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
3.ఇప్పుడు ఉడికించిన చింతకాయలనుంచి చేతులతో వత్తుకుంటు రసం వడకట్టుకోవాలి.
4.కావాలసినన్ని నీళ్లను పోసి చారులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా,పసుపు,అల్లంవెల్లులి పేస్ట్,ధనియాల పొడి,జీలకర్ర మెంతుల పొడి,నువ్వుల పొడి,కరివేపాకు ,అవరసరం అనుకుంటే కూరగాయల ముక్కలు వేసి స్టవ్ పై సిమ్ లో పెట్టి మరిగించాలి.
5.అందులో వేసుకున్న కూరగాయ ముక్కలు ఉడికే వరకు మరిగించుకోవాలి.

6.ఇప్పుడు ఒక గిన్నెలోకి బియ్యం పిండి నీళ్లను కలిపిన చిక్కని బియ్యం నీళ్లను మరుగుతున్న చారులో కలుపుకోవాలి.
7.ఇలా చేయడం వల్లా చారు మరింత చిక్కగా తయారవుతుంది.
8.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపును వేపుకోవాలి.
9.వేగిన తాలింపును మరగించుకున్న చారులో కలుపుకోవాలి.
10.అంతే చింతకాయ చారు రెడీ.