Guntur kaaram Movie: ‘గుంటూరు కారం’ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
Guntur kaaram Movie:త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. శ్రీలీల ప్రధాన హీరోయిన్ అవగా, మీనాక్షి చౌదరి కూడా నటిస్తుంది.
ఈ సినిమా జనవరి 12వ తేదీన అభిమానుల ముదుకు రావటానికి సిద్దం అయింది. ఈ సినిమా కథను మొదట త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకొని రాసాడట. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని ప్రకటన వచ్చింది.
ఏమి అయిందో తెలియదు కానీ ఎన్టీఆర్ స్థానంలో మహేష్ బాబు వచ్చాడు. ఏదేమైనప్పటికీ 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.