Healthhealth tips in telugu

Weight Loss:10 రూపాయిల ఖర్చుతో ఎంతటి వేలాడే పొట్ట,నడుం,తొడలచుట్టూ కొవ్వును మైనంలా కరిగించవచ్చు

Belly Fat Tips In telugu :ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు సమస్య ఒకటి. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు

అయితే ఫలితాన్ని ఇవ్వవు.కొంతమంది బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తూ ఉంటారు మరికొంతమంది కఠినమైన డైట్ చేస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గడానికి ఇప్పుడు చెప్పేది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి ఎలా తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం

బరువు పెరగడం అయితే స్పీడ్ గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఏవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు అయితే ఇంటి చిట్కాలను ఫాలో అయితే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు

మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు చాలా తొందరగా తగ్గవచ్చు కీర దోశ ముక్కలు,అల్లం ముక్కలను మిక్సీలో వేసి నీటిని పోసి మిక్సీ చేయాలి.

మిక్సీ అయ్యాక ఈ మిశ్రమాన్ని గ్లాస్ లోకి వడగట్టి దానిలో అరచెక్క నిమ్మరసం కలిపి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ డ్రింక్ తాగటం వలన వేసవిలో వచ్చే డీ హైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.