Healthhealth tips in telugu

Lemon Juice:పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Lemon Juice benefits In Telugu :పెరిగిన అవగాహనతో చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతున్నారు. ఇందులో కొంతమంది తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుందని భావిస్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా మంది కొన్ని తప్పులు చేస్తున్నారు.. వాటిని సరిదిద్దుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ నేపథ్యంలో శరీరాన్ని సరైన ఆకృతిలో పెట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగుతున్నారు. అయితే, ఇది మంచి అలవాటే కానీ, నిమ్మరసంని ఉదయాన్నే ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల ఆ పులుపు శాతం దంతాలపై ఎక్కువగా పుడుతుందని చెబుతున్నారు. ఇది ఎక్కువైతే అది దంతాల నుంచి చిగుళ్లపై పడుతుందని చెబుతున్నారు. అందుకే నిమ్మరసం శాతాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.అదే విధంగా.. ఉదయాన్నే కొంత మంది రాత్రి వేళల్లో బ్రష్ చేసుకున్నాం కదా.. అని దీన్నే డైరెక్ట్‌‌గా తీసుకుంటారు. కానీ, ఇలా చేయకూడదు.

నిమ్మరసం తీసుకునే ముందు కచ్చితంగా నోటిని శుభ్రం చేసుకోవాలి. రెండు మూడు సార్లు నోటిని నీటితో పుక్కిలించాలి. ఆ తర్వాతే నీటిని తాగాలి. లేకపోతే నోటిలోని బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.రోజుకి సగం నిమ్మ చెక్క చాలు..నిమ్మకు బరువుని తగ్గించే గుణం ఉంది.

ఇది నిజమే.. కానీ, దీనిని ఎక్కువగా తీసుకుంటే అది కడుపులో చేరి ఎసిడిటీగా వృద్ధి చెందుతుంది. ఇది మరింత సమస్యగా మారుతుంది. సగం నిమ్మచెక్క రసం తీసుకుంటే చాలు.. సగం నిమ్మపండుకంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మరసాన్ని ఎక్కువ వాడితే ఎసిడిటీ వృద్ధి చెందుతుంది. అది చేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది. మోతాదుకు మించి వాడొద్దు.

వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగే ముందు.. మామూలు నీళ్లతో నోటిని రెండుమూడుసార్లు పుక్కిలించిన తర్వాతే తాగాలి. లేదంటే బ్రెష్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. లేకపోతే నోట్లోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.