Dandruff Remedy: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ హెయిర్ మాస్క్ ఉపయోగించండి చాలు..
Dandruff Home remedies In telugu : చుండ్రు సమస్య ఒక్కసారి వచ్చిందంటే త్వరగా తగ్గదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన చుండ్రు తగ్గించుకోవటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చుండ్రు సమస్య తగ్గటానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.
ఉల్లిపౌయ చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఒక ఉల్లిపాయను తీసుకొని తొక్క తీసి తురమాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అర కప్పు ఆలివ్ ఆయిల్ వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లి తురుమును వేసి పది నిమిషాలు సిమ్ లో పెట్టి మరిగించి చల్లారాక వడకట్టాలి.
ఈ నూనెలో ఒక స్పూన్ వేప పొడి,ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి cap పెట్టుకొని రెండు గంటలు అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
వేప పొడిని మార్కెట్ లో లభ్యం అవుతుంది. లేదా వేప ఆకులను నీడలో ఎండబెట్టి పొడిగా చేసుకొని వాడుకోవచ్చు. వేపలో ఉండే లక్షణాలు చుండ్రు సమస్యను తొలగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే ఉల్లిపాయ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.