Electric Rice Cooker Side Effects:రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి
Electric Rice Cooker Side Effects:నేటి బిజీ జీవన విధానంలో వంట చేసుకోవటానికి కూడా తీరిక ఉండటం లేదు. అందుకే చాలా మంది కరెంట్ రైస్ కుక్కర్స్ ఆధారపడుతున్నారు. రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేసి కర్రీ పాయింట్ నుండి కర్రీ తెచ్చేసుకుంటే అయిపోతుంది. అయితే రైస్ కుక్కర్ లో వండిన ఆహారం మంచిది కాదని తెలిసిన కూడా అందరు రైస్ కుక్కర్లు వైపే మొగ్గు చూపుతున్నారు.
ప్రతి రోజు రైస్ కుక్కర్ లో అన్నం వండుకొని తింటే మన ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. రైస్ కుక్కర్ లో అన్నం వండితే విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఉంది. రైస్ కుక్కర్లు అన్ని అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచిది కాదు.
ఆహారం వండేటప్పుడు గాలి వెలుతురు తగులుతూ ఉండాలి. ఆలా లేకపోతే ఆహారం విషంగా మారుతుంది. ఈ విషాలలో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది తక్షణమే పనిచేస్తుంది దీనిని ఫుడ్ పాయిజిన్ అని అంటారు. మరొకటి శరీరంలోకి చేరి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ విష ప్రభావం బయట పడుతుంది.
ప్రేజర్ కుక్కర్ లేదా కరెంట్ రైస్ కుక్కర్ లో అన్నం వండేటప్పుడు గాలి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితిలోను ఉండదు. వీటిని అల్యూమినియంతో తయారుచేస్తారు. ఈ అల్యూమినియం వాడకం బ్రిటిష్ కాలం నుండి ప్రారంభం అయింది. ఆ రోజుల్లో జైలులో ఖైదీలుగా ఉన్న భారతీయ ఉధ్యమకారులను నిర్వీర్యం చేయటానికి అల్యూమినియం పాత్రల్లో వంట చేసి పెట్టేవారు.
అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తిని వారికి నిసత్తువ కలిగేది. అంటే మనం తిన్నా కూడా అదే పరిస్తితి ఎదురు అవుతుంది. మరొక విషయం ఏమిటంటే ప్రేజర్ కుక్కర్ లేదా కరెంట్ రైస్ కుక్కర్ వండిన అన్నం ఒత్తిడికి గురి అయ్యి మెత్త పడుతుంది. కానీ ఉడకదు. ఆహారం మెత్త పడటం వేరు ఉడకటం వేరు. అన్నం మెత్తపడితే పోషకాలు ఉండవు.
అన్నం ఉడికితేనే పోషకాలు ఉంటాయి. అన్నం వండటానికి మట్టి కుండను వాడితే పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. పోషకాలు వంద శాతం అలానే ఉంటాయి. కంచు పాత్రల్లో ఆహారాన్ని వండితే పోషకాలు 97 శాతం ఉంటాయి. ఇత్తడి పాత్రల్లో వండితే 93 శాతం పోషకాలు ఉంటాయి. ఇక అల్యూమినియం రైస్ కుక్కర్ లలో వండితే 7 నుంచి 13 శాతం మాత్రమే పోషకాలు ఉంటాయి.
చూశారుగా ఏ పాత్రలో వండితే పోషకాలు ఎలా ఉంటాయో. కాబట్టి మీరు ఆలోచించండి ఏ పాత్రలో వండితే పోషకాలు వంద శాతం ఉంటాయో. దాన్ని బట్టి ఆహారాన్ని వండుకొండి. ఇక అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ఉదర సంబంద సమస్యలు,కీళ్ల వాతం,మధుమేహం,గ్యాస్ సమస్యలు,గుండె సంబందిత సమస్యలు,నడుము నొప్పి,అధిక బరువు వంటి అనేక సమస్యలు వస్తాయి.
కాబట్టి ప్రేజర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్ లో కానీ వండటం సాధ్యమైనంత వరకు మానేయటమే ఉత్తమం. మట్టి పాత్రలు లేదా కంచు పాత్రలు లేదా ఇత్తడి పాత్రల్లో కానీ వండటం అలవాటు చేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.