Healthhealth tips in telugu

Delivery after weight loss:డెలివరీ అయ్యాక అధిక బరువు,పొట్టను నిర్లక్ష్యం చేస్తున్నారా…రిస్క్ లో పడినట్టే

Delivery after weight loss Tips In telugu :సాధారణంగా మహిళల్లో డెలివరీ అయ్యాక అధిక బరువు, పొట్ట తగ్గటం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. డెలివరీ అయ్యాక తమ ఆరోగ్యం,బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే పెరిగిన బరువు,పొట్ట ఎలా తగ్గుతాయో అనే ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది.

అయితే పొట్ట తగ్గటానికి కొంత సమయం పడుతుంది. పూర్వం డెలివరీ అయ్యాక నడుము కట్టు కట్టేవారు. ఇప్పుడు అయితే బెల్ట్ వాడుతున్నారు. బెల్ట్ వాడిన నడుము కట్టు కట్టినా ఒక పద్దతి ప్రకారం చేయాలి. ఉదయం స్నానం అయ్యాక నడుము కట్టు కట్టి రాత్రి పడుకొనే ముందు మాత్రమే తీయాలి. ఇలా చేస్తేనే ఫలితం ఉంటుంది.

అయితే చాలా మంది డెలివరీ అయ్యాక నడుము కట్టు కట్టిన భోజనానికి ముందు,ఎదో పని ఉందని అస్తమాను తీసి కడుతూ ఉంటారు. ఇలా చేయటం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. నార్మల్ డెలివరీ అయినా వారు ఈ విధంగా చేయవచ్చు. వారికీ పెద్దగా ఇబ్బంది ఉండదు. నడుము కట్టు కట్టినప్పుడు వెడల్పుగా కట్టాలి. డెలివరీ అయినా మరుసటి రోజు నడుము కట్టు కడితే పొట్టకు సపోర్ట్ ఉంటుంది. అలాగే వెనక నడుము దగ్గర ముడి ఉండటం వలన అక్యు ప్రజెర్ గా పనిచేస్తుంది.

సిజేరియన్ ఆపరేషన్ అయినవారికి కూడా నడుము కట్టు కట్టవచ్చు. అయితే కుట్లు పై భాగం నుండి మాత్రమే నడుము కట్టు కట్టాలి. ఒక వారం వరకు ఇలా చేసి ఆ తర్వాత ఎలాగైనాకట్టుకోవచ్చు . అయితే మధ్యమధ్యలో కుట్లు వేసిన చోట ఎలా ఉందో గమనిస్తూ ఉండాలి. నార్మల్ డెలివరీ అయినా వారు పొట్టకు సంబంధించి వ్యాయామాలు డాక్టర్ సలహా ప్రకారం చేయాలి.

ఇక సిజేరియన్ అయినా వారు ఎనిమిది వారాల పాటు పొట్ట ఎక్సరసైజ్ లు చేయకపోవటమే మంచిది . డెలివరీ తర్వాత పొట్ట,అధిక బరువు తగ్గటానికి కొంత సమయం పడుతుంది. ప్రతి రోజు అరగంట పొట్ట వ్యాయామం చేస్తూ ఉంటే పొట్ట తొందరగా తగ్గుతుంది. అయితే ఏమి చేసిన డాక్టర్ సలహాతో చేయటం అన్ని విధాలా మంచిది.

వీటితో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే తొందరగా పొట్ట తగ్గుతుంది.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఓక్ గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే,అరచెక్క నిమ్మరసం కలుపుకొని త్రాగాలి. ఈ విధంగా రోజు చేయటం వలన శరీరంలో కొవ్వు కరగటమే కాకుండా శరీరంలో విషాలు బయటకు వెళ్లిపోతాయి.

రోజులో ఒకసారి గ్రీన్ టీ తీసుకోండి. గ్రీన్ టీ తీసుకోవటం వలన గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వును కరిగించటంలో సహాయపడతాయి.

నూనె పదార్ధాలు,తీపి పదార్ధాలు,జంక్ ఫుడ్స్ తినటం మానేయాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు

ఒత్తిడి తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటె నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ బరువు పెరగటానికి కారణం అవుతాయి.

ప్రతి రోజు ఆనపకాయ జ్యుస్ త్రాగాలి. చిన్న ఆనపకాయ ముక్కను తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిని చేర్చి మిక్సీ చేసి జ్యుస్ గా తయారుచేసుకోవాలి. ఈ జ్యుస్ త్రాగటం కష్టంగా ఉంటే నిమ్మరసం లేదా తేనే కలుపుకోవచ్చు. రోజు త్రాగలేకపోతే రెండు రోజులకు ఒకసారి త్రాగాలి. ఆనపకాయ పొట్టలో కొవ్వును కరిగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.

క్యాబేజి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే క్యాబేజీలో ఉండే పీచు శరీరంలో కొవ్వు కరగటానికి బాగా సహాయాపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.