Beauty Tips

Hair Care Tips:వారానికి ఒకసారి రాస్తే చాలు జుట్టు రాలకుండా 10 రేట్లు వేగంగా ఒత్తుగా పెరుగుతుంది

Hair growth Tips in telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మందిని వేదిస్తున్న సమస్యలలో జుట్టు రాలే సమస్య ఒకటి. మగ వారిలో అయితే బట్టతల వచ్చేస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

రాత్రి సమయంలో రెండు స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టాలి. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక మిక్సీ జార్ లో ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఉసిరి ముక్కలు,నానబెట్టిన మెంతులలో నీటిని మాత్రమే వేసి మిక్సీ చేయాలి.

ఈ పేస్ట్ ని ఫిల్టర్ చేసి కేవలం రసాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ రసంలో ఒక స్పూన్ ఆముదం కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టేలా స్ప్రే చేసుకోవాలి. అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఈ విధంగా సమస్యను బట్టి అంటే సమస్య ఎక్కువగా ఉంటే వారానికి రెండు లేదా మూడు సార్లు చేయవచ్చు. సమస్య తక్కువగా ఉన్నప్పుడూ వారంలో ఒకసారి సరిపోతుంది. ఈ రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెమిడీని ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.