MoviesTollywood news in telugu

Prema entha madhuram serial:ప్రేమ ఎంత మధురం సీరియల్ అనుకి డబ్బింగ్ చెప్పేది ఎవరో తెలుసా?

prema entha madhuram serial anu :బుల్లితెర సీరియల్స్ కి గల నేపథ్యంలో జి తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ విజయవంతంగా నడుస్తూ, ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా ప్రేమ ఎంత మధురం సీరియల్ కి ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. పైగా ఈ సీరియల్ మొదటి నుంచి టాప్ ప్లేస్ లో నడుస్తోంది.

సమిష్టి కృషి వలన ఈ సీరియల్ జనరంజకంగా నడుస్తోందని అంటున్నారు. కొత్త కొత్త ట్విస్ట్ లతో నడుస్తున్న ఈ సీరియల్ లో ఆర్యవర్ధన్, అను హీరో హీరోయిన్స్ గా మంచి నటన కనబరుస్తున్నారు. అను అసలు పేరు వర్ష హెచ్ కె. ఈమె ముద్దు ముద్దు మాటలతో, అమాయకపు లుక్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది.

మరి అను కి ఇంతలా పేరు రావడానికి డబ్బింగ్ చెప్పింది ఎవరంటే, చక్రం జయ. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయ ఎన్నో సీరియల్స్ లో ఎంతోమందికి డబ్బింగ్ చెప్పి వాళ్ళ వాయిస్ కి ప్రాణం పోసింది. అందుకే అను కి అందమైన స్వరం అందించి మంచి పేరు రావడానికి దోహదమైంది.