Kitchenvantalu

Vankaya Vellulli Fry : వంకాయ వెల్లుల్లి ఫ్రై.. త‌యారీ ఇలా.. అన్నంలో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..!

Vankaya Vellulli Fry:వంకాయ వెల్లుల్లి కారం..ఎలా చేసినా వంకాయ రుచి అమోఘంగానే ఉంటుంది.ఫ్రై చేసినా,గుత్తి వంకాయ చేసినా ,వంకాయ మిక్స్డ్ కర్రీ చేసినా సూపర్ గానే ఉంటుంది.వంకాయ వెల్లుల్లి కారం స్పైసీ స్పైసీ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – ¼ kg
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 2
వెల్లుల్లి రెబ్బలు – 10
జీలకర్ర – 1 టీ స్పూన్
నువ్వులు – 2 టీ స్పూన్
ధనియాలు – 2 టీ స్పూన్
కొబ్బరి – 2 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు -1 ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 7-8

తయారీ విధానం
1.వంకాయలను ముక్కలుగా కట్ చేసుకోని ఉప్పు నీళ్లలో వేసుకోవాలి.
2.వెల్లుల్లి కారం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని వెల్లుల్లి, జీలకర్ర,ధనియాలు,నువ్వులు,కొబ్బరి పొడి,వేసి వేపుకోవాలి.
ఎండు మిర్చి వేసి వేగాక పక్కన పెట్టుకోవాలి.
3.పదార్ధాలు చల్లారక మిక్సి జార్లో వేసుకోని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

4.ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
5.అందులోకి పచ్చిమిర్చి ,పసుపు,వేసి కలుపుకోని కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసి మిక్స్ చేసుకోవాలి.
6.పది నిమిషాలు వంకాయలు కొద్దిగా మగ్గాక రుచికి సరిపడా ఉప్పు,గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసి కలుపుకోవాలి.
7.పదినిమిషాలు లో ఫ్లేమ్ పై మగ్గించుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే వంకాయ వెల్లుల్లి కారం రెడీ.