Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది
Face Glow Tips:ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందమైన తెల్లని ముఖం కావాలని కోరుకుంటున్నారు. అలా కోరుకోవటం కూడా సహజమే. అయితే వాతావరణంలో కాలుష్యం, దుమ్ము,ధూళి కారణంగా ముఖం మీద జిడ్డు పేరుకుపోయి ముఖం నల్లగా కాంతివిహినంగా మారుతుంది.
బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఇంటి చిట్కాలతో జిడ్డు లేని తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
జిడ్డు కారణంగా మొటిమలు కూడా వస్తాయి. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే నల్లని మచ్చలు,మొటిమలు,జిడ్డు అన్ని తొలగిపోతాయి. ఈ చిట్కా కోసం కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ తాజా అలోవెరా జెల్, అరస్పూన్ గందం పొడి,చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాలు అయ్యాక చల్లని నితిఒ శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి పలితాన్ని పొందవచ్చు. కలబంద ఒక మల్టీ టాస్కింగ్ పదార్ధం. మొటిమలు మరియు మొటిమల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పిగ్మెంటేషన్ మరియు డల్ స్కిన్ కోసం పర్ఫెక్ట్ శీతాకాలపు ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు. కలబంద అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News