Beauty Tips

Hair Care Tips:ఈ తొక్కలతో ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య అసలు ఉండదు…ఇది నిజం

pomegranate peels Hair Fall Tips : జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే శాశ్వతంగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

దానిమ్మ పండు తిన్నప్పుడు దానిమ్మ తొక్కలను పాడేస్తూ ఉంటాం. కానీ వాటిలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆ విషయం మనలో చాలా మందికి తెలియదు. జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి దానిమ్మ తొక్కలు చాలా బాగా పని చేస్తాయి. ఒక పండు తొక్కలను తీసుకోవాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోయాలి.

నీరు కాస్త వేడి అయ్యాక దానిమ్మ తొక్కలు,ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి, 10 లవంగాలు,అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి పది నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టాలి. ఈ నీరు చల్లారాక ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. చల్లారిన ఈ నీటిలో ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి.

ఈ నీటిని జుట్టుకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయాలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటమే కాకుండా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.