Healthhealth tips in telugu

పెరుగు ఎక్కువగా తింటున్నారా…ఈ నిజాన్ని తెలుసుకోకపోతే…

Curd Health benefits In telugu :మనలో చాలామంది భోజనం చేసే సమయంలో పెరుగు అన్నం తినకపోతే ఆ రోజు భోజనం చేసినట్టు తృప్తి అనేది ఉండదు. కొంతమంది పెరుగన్నం తినకుండా పెరుగు తింటూ ఉంటారు.

పెరుగులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

పెరుగు మామిడి పండుతో కలిపి తీసుకో కూడదు.కొంత మంది పెరుగు అన్నంలో మామిడిపండు ముక్కలు వేసుకొని తింటారు. అలాగా పెరుగు అన్నంలో మామిడిపండు రసం కలుపుకొని తింటూ ఉంటారు. ఈ విధంగా తీసుకుంటే చర్మ ఎలర్జీ మరియు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది

చాలామంది పెరుగుతో రైతా చేసుకుంటూ ఉంటారు ఇలా చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఉల్లిపాయి వేస్తూ ఉంటారు. పెరుగు చల్లదనాన్ని ఇస్తే ఉల్లిపాయ శరీరంలో వేడిని కలిగిస్తుంది. ఈ రెండు విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం వలన దద్దుర్లు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది

చేపల కూర తిన్నప్పుడు కూడా పెరుగు తినకూడదు. ఎందుకంటే గ్యాస్ అల్సర్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి. కాబట్టి పెరుగు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.