Pear Fruit:ఈ పండులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం
Pear Fruits Benefits In telugu :పియర్ పండును బేరి పండు అని కూడా పిలుస్తారు. ఈ పండు ఒక వైపు సన్నగా అండాకారం తోను మరొక వైపు లావుగా గోళాకారంతోను కన్నీటిబొట్టు ఆకారం వలె వుంటుంది. ఈ పండు తాజాగా ఉన్నప్పుడు మంచి రుచి,సువాసన కలిగి యుంటుంది.
ఈ పండు యొక్క మధ్య భాగం చాలా మృదువుగా ఉంటుంది. ఈ పియర్ పండ్లతో జామ్‌లు, జెల్లీలు లేదా జ్యూస్, సలాడ్స్ తయారుచేస్తారు. ఈ పండు యొక్క పై భాగం ఆకుపచ్చగా, ఎర్రగా, పసుపుగా లేదా గోధుమ రంగు వర్ణంలో ఉంటుంది మరియు లోపల భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు యొక్క పైభాగం రుచి వగరుగాను, లోపలి గుజ్జు తీయ్యగా మరియు పుల్లగా కలగలిసిన రుచిని కలిగి వుంటుంది.
ఈ పండులో నీటి శాతం 83 శాతం ఉంటుంది. పియర్ పండులో విటమిన్లు ఎ.బి. డి.ఇ. మరియు మినిరల్స్ పొటాషియం, ఫాస్పరస్, మరియు కాపర్,ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ఈ పండులో చాలా తక్కువ మొత్తంలో ఐరన్ కూడా ఉంటుంది. ఈ పండ్లు సంవత్సరంలో ఒక్క సీజన్ లో మాత్రమే లభ్యం అవుతాయి.
ఈ పండు గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ పియర్ పండులో ఎన్నో శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది.అంతేకాక మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు.
పియర్స్ లో సోడియం ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, మరియు 190గ్రాముల పొటాషియం ఉంటుంది. పియర్స్ పండును వారంలో ఒక్కసారి తినాలి. పియర్ పండులో యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన ఇవి శరీరంలో కార్సినోజెన్ సెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. దాంతో కోలన్ బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది.
ఈ పండులో మినరల్స్ అధికంగా ఉంటాయి. పియర్ లో ఉండే బోరాన్ కాలిష్యం శరీరం బాగా గ్రహించేలా చేస్తుంది.కాలిష్యం ఎముకల ఆరోగ్యానికి మరియు ఎముకల నిర్మాణానికి చాలా అవసరం. బోరాన్ మహిళల్లో ఈస్ట్రోజెన్ ప్రొడక్షన్ ను పెంచి మంత్లీ సైకిల్ ను మెరుగుపచడంలో హార్మోన్స్ ను క్రమబద్దం చేస్తుంది.
పియర్స్ లో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ కె, ఇతర మినిరల్స్ ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి వృద్దాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఆలస్యం అయ్యేలా చేస్తుంది. అంతేకాక చర్మంలో కొల్లాజెన్ ను డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.