Healthhealth tips in telugu

Liver Detox: ఇవి రోజూ తింటే.. లివర్‌లోని చెత్త బయటకు వస్తుంది..!

Liver Foods in telugu :శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో, ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో, మ‌నం తినే కొవ్వు ప‌దార్థాల‌ను జీర్ణం చేసేందుకు, మనం తినే ఆహారంలో ఉండే విట‌మిన్ల‌ను నిల్వ చేసుకునేందుకు లివ‌ర్ ఎంత‌గానో శ్ర‌మిస్తుంది. శరీరంలో ఉన్న ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. లివ‌ర్ ప‌నిచేయ‌క‌పోతే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక లివ‌ర్‌ను మ‌నం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద సూచించిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..?

క్యారెట్
క్యారెట్లలో ఫ్లేవ‌నాయిడ్లు, బీటా కెరోటీన్ ఉంటాయి. ఇవి లివ‌ర్ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ లివ‌ర్ వ్యాధులు రాకుండా చూస్తుంది. ఈ క్ర‌మంలోనే క్యారెట్‌ను నిత్యం తీసుకుంటే లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

వెల్లుల్లి
వెల్లుల్లిని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల లివ‌ర్‌లో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది.

యాపిల్
యాపిల్ పండ్ల‌లో ఉండే పెక్టిన్ జీర్ణాశ‌యంలో ఉండే విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాల సంఖ్య త‌గ్గుతుంది. లివ‌ర్‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంది. క‌నుక నిత్యం ఒక యాపిల్‌ను తింటే లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

వాల్‌న‌ట్స్
నిత్యం గుప్పెడు వాల్‌న‌ట్స్‌ను తింటే లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. వాల్‌న‌ట్స్‌లో అమైనో యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపి లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. వాల్‌న‌ట్స్‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ ఉన్న‌వారు వాల్‌న‌ట్స్‌ను తింటే ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.