Devotional

Makar Sankranti 2024: మకర సంక్రాంతి నాడు మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే…

Makar Sankranti 2024: సంక్రాంతి పండుగను చాలా వేడుకగా జరుపుకుంటాం. సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. అందుకే ఆ పండుగకు మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. మకర సంక్రాంతి రోజు తల స్నానం చేసి పూజలు చేసి నువ్వులను ఆహారంగా తీసుకుని కొన్ని వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేస్తే మంచిదో తెలుసుకుందాం.

మేష రాశి వారు సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. బెల్లం, నువ్వులు, శనగపప్పు, బట్టలు వంటి వాటిని దానం చేయొచ్చు. ఈ విధంగా దానం చేయడం వలన ఇంటిలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.

వృషభ రాశి వారు తెల్లని వస్త్రం, పెరుగు, నువ్వులను దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.

మిధున రాశి వారు బియ్యం పప్పు, దుప్పటి వంటి వాటిని పేదవారికి దానం చేయాలి. శారీరక సమస్యలు ఉన్నవారు నల్ల నువ్వులు, నల్లని గొడుగును దానం చేయాలి.

కర్కాటక రాశి వారు బియ్యం, వెండి, తెల్ల నువ్వులను దానం చేయాలి. వీటితో పాటుగా సామర్థ్యం ఉన్నంతవరకు పసుపు బట్టలు, పాలు లేదా నెయ్యిని కూడా దానం చేయవచ్చు.

సింహ రాశి వారు పేదవారికి దుప్పట్లు ఇవ్వటం వలన ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఎరుపు రంగులో ఉండే బట్టలు, గోధుమలు, రాగి వంటి వాటిని కూడా దానం చేయవచ్చు.

కన్య రాశి వారు పచ్చని వస్త్రాలను దానం చేయడం వలన జీవితంలో ఉండే ఒత్తిడి తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.

తులా రాశి వారు పంచదార, తెల్లని గుడ్డు, దుప్పటి దానం చేస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి వారు పేదవారికి ఎరుపు వస్త్రాలను, నువ్వులను దానం చేస్తే జీవితంలో ఆనందంగా ఉంటారు. అలాగే మంచి ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి వారు పసుపు రంగులో ఉండే వస్త్రాలు, బెల్లం దానం చేస్తే ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఐశ్వర్యం లభిస్తుంది.

మకర రాశి వారు నల్ల దుప్పటి, నూనె, నువ్వులను దానం చేయటం వలన డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి వారు నల్లని వస్త్రాలను, ఉసిరి పప్పు, కిచిడి, నువ్వులు వంటి వాటిని దానం చేస్తే ప్రశాంతంగా ఉంటారు.

మీన రాశి వారు బియ్యం, పప్పు, నువ్వులను దానం చేయడం వలన సూర్యుని అనుగ్రహం కలిగి ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు.