Beauty Tips

Face Glow Tips:పంక్షన్ ముందు మీ ముఖం ఆకర్షణీయంగా కనపడటానికి చిట్కాలు

ఒక రోజులో మనం అందంగా మారలేము. కానీ ఉన్నంతలో ఆకర్షణీయంగా ఉండవచ్చు. మరుసటి రోజు ఏదైనా పెళ్లి వేడుక లేదా పుట్టినరోజుకు వెళ్ళవలసి వస్తే ముందు రోజు రాత్రి ఈ చిట్కాలను పాటించండి.

తెల్లవారేసరికి మీ పాదాలు మరియు చేతులు మృదువుగా కనపడాలంటే రాత్రి పూట పెట్రోలియం జెల్లీని రాయాలి. బాదం నూనెతో కూడా మర్దన చేయవచ్చు. తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి కాళ్ళు రెండు కాసేపు ఉంచితే మంచిది.

పెదవులు పొడి బారినట్లు అనిపిస్తూ ఉంటే రాత్రి పడుకొనే ముందు ఆలివ్ ఆయిల్ లో కొంచెం పంచదార కలిపి పెదవులపై రుద్దాలి. దీనివల్ల పెదాలపై మృతకణాలు దూరం అవుతాయి. తర్వాత లిప్ బామ్ రాసుకొని పడుకుంటే ఉదయం పెదాలు మృదువుగా ఉంటాయి.

పని ఒత్తిడి వల్ల కళ్ళు ఉబ్బినట్లు ఉంటే మీ కళ్ళకు చల్లదనంను ఇచ్చే ఐ క్రీం ను ఫ్రిడ్జ్ లో పెట్టండి. రాత్రి పడుకునే ముందు తీసి కళ్ళ క్రింద రాసుకుంటే ఉదయం వాపు తగ్గి తాజాగా కనిపిస్తాయి. ఐ క్రీం కి బదులుగా బాదం నూనెను ఉపయోగించవచ్చు.

కనురెప్పలకు ఉన్న వెంట్రుకలు ఒత్తుగా కనపడాలంటే రాత్రి పడుకొనే ముందు కాస్త ఆముదం నూనెను కనురెప్పలకు రాయాలి. ఉదయం లేచాక వేడి నీళ్ళతో కడగాలి.