చలికాలంలో జామ పండు తింటే డాక్టర్‌తో పనే ఉండదు, ఎందుకంటే..
Guava Health Benefits :చలికాలం ప్రారంభం అయిపోయింది. ఈ చలి కాలంలో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చలి కారణంగా రొంప, దగ్గు, గొంతు నొప్పి, న్యూమోనియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చలికాలం ప్రారంభం కాగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
మన పెద్దవారు చలికాలంలో జామకాయ తినవద్దు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే జామకాయ తింటే జలుబు చేస్తుందని చెబుతూ ఉంటారు. కానీ దానిలో వాస్తవం లేదు. ఎందుకంటే జామకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయలో కన్నా జామకాయ లోనే విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వలన జామ కాయ తింటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడి జలుబు, గొంతు నొప్పి వంటివి రావు.
అలాగే డయాబెటిస్ తో బాధపడేవారికి జామకాయలో ఉండే పీచు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. జామకాయలో ఉండే కాపర్ థైరాయిడ్ సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు రోజుకు ఒక జామ కాయ తింటే చాలా మంచిది. మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.