MoviesTollywood news in telugu

Tollywood Hero:ఆకాష్ గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా ?

‘ఆనందం’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత వరుస అవకాశాలు వచ్చిన హిట్ బాట పట్టలేదు. దాంతో అవకాశాలు రావటం తగ్గింది. తెలుగు నుంచి తమిళానికి వెళ్లిన పరిస్థితిలో మార్పు లేదు.

దాంతో హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సునీల్ హీరోగా 2006లో వచ్చిన ‘అందాల రాముడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సక్సెస్ అవ్వటంతో నవ వసంతం, గోరింటాకు, నమో వెంకటేశ వంటి సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి.

ఒక పక్క సినిమాలు చేస్తూనే బుల్లితెరలో సీరియల్స్ చేస్తున్నాడు. కన్నడలో ఆకాష్ నటించిన ‘జోతాయి.. జోతాయల్లీ’ సీరియల్ అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇదే సీరియల్‌‌ని తమిళంలో కూడా ‘నీతానై ఎంతన్ పొన్వసంతన్’ పేరుతో ప్రసారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సీరియల్‌నే తెలుగులో ‘ప్రేమ ఎంత మధురం’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

అలాగే ‘ఏ క్యూబ్’ పేరుతో మూవీ యాప్‌ను సిద్ధం చేశారు ఆకాష్. ఈ యాప్ ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా మరోమారు అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు.