MoviesTollywood news in telugu

Allari Naresh:అల్లరి నరేష్ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిస్తే అసలు నమ్మలేరు

స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా టాలీవుడ్ లో కమెడియన్ స్టార్ హీరోగా పరిచయమైన అల్లరి నరేష్ తొలిచిత్రంతోనే హిట్ కొట్టి,అదే ఇంటిపేరుగా మలచుకున్నాడు. అల్లరి సినిమాతో నవ్వులు పూయించిన అల్లరి నరేష్ హాస్య రసంతో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.

1982జూన్ 30న ఈవీవీ దంపతులకు జన్మించాడు. అతడి వాలకం అదీ చూసి ఏనాడు సినిమా హీరో అవ్వాలని అనుకోలేదు. తమిళనాడు చెట్టినాయుడు స్కూల్ లో ప్రాధమిక విద్య పూర్తిచేసాడు. కామర్స్ డిగ్రీ చేసాక అనుకొకుండా సినీ రంగ ప్రవేశం అయింది.

నటుడు చలపతిరావు తనయుడు డైరెక్టర్ రవిబాబు ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాక నరేష్ ని హీరోగా పెట్టాలని అనుకున్నాడట. అప్పటికే పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్ ని హీరోగా ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్న ఈవివితో పాటు చలపతిరావు కూడా రవిబాబు ప్రతిపాదనకు షాకయ్యారట.

అయితే రవిబాబు పట్టుబట్టడంతో అల్లరి సినిమా స్టార్ట్ అయింది. 18ఏళ్ళ కుర్రాడిగా ఈ సినిమాలో నటించిన నరేష్ వయస్సు అప్పటికి 20ఏళ్ళు. ఈ సినిమా 2002లో మంచి హిట్ అయింది.ఆ సినిమాతో ఇంటిపేరు అల్లరి అయిపొయింది. ఇక అల్లరి నరేష్ ఆ మూవీ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రాజేంద్రప్రసాద్, నరేష్ తర్వాత కామెడీ హీరోగా అల్లరి నరేష్ రావడంతో వరుస ఛాన్స్ లు వచ్చిపడ్డాయి.

అయితే హాస్య చిత్రాలకే పరిమితం కాకుండా గమ్యంలో గాలి శ్రీను,ప్రాణంలో శివుడు,నేను,విశాఖ ఎక్స్ ప్రెస్ లో రవివర్మ, పాత్రలతో ఆకట్టుకున్నాడు. కొద్దికాలంలోనే మినిమమ్ గ్యారంటీ హీరోగా నిలిచాడు.2015లో పెళ్లయింది. వీరికి ఒకపాప ఉంది. నేటి తరం హీరోల్లో 50 సినిమాలు పూర్తిచేసిన హీరో అయ్యాడు. అయితే వరుస విజయాలే కాదు అపజయాలు వెన్నంటాయి. 2012సుడిగాడు తర్వాత ఒక్క హిట్ పడలేదు. మహర్షితో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు.

మరల హీరోగా సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు. కెరీర్ అలా అలా నడుస్తుంది. ప్రస్తుతం తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. చేస్తున్న సినిమాలు హిట్ కావాలని కోరుకుందాం.