Beauty Tips

Elbow darkness removal: ఈ ఆకుతో ఇలా మసాజ్‌ చేస్తే.. మోచేతుల నలుపు మాయం అవుతుంది..!

Elbow darkness removal: సాధారణంగా కొంతమంది మోచేతులు నల్లగా అందవిహీనంగా కనబడుతూ ఉంటాయి ఈ సమస్య ఆడవారిలోనూ మగవారిలోనూ ఇద్దరిలోనూ కనబడుతుంది కాకపోతే మగవారు పెద్దగా పట్టించుకోరు.

ఆడవారు మాత్రం ఈ సమస్య గురించి తీవ్రంగా ఆలోచించి ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టకుండా మన ఇంటిలో ఉండే తులసి ఆకులతో తగ్గించుకోవచ్చు.

తులసి ఆకు ను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు దీనికోసం 10 నుంచి 12 తులసి ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని మోచేతుల పై రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే మరో చిట్కా తెలుసుకుందాం తులసి ఆకుల రసంలో కొంచెం బియ్యపిండి, కొంచెం తేనె వేసి బాగా కలిపి మోచేతులకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. అరగంటయ్యాక నీటిని జల్లుతూ రబ్ చేస్తూ కడగాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే నలుపు క్రమంగా తగ్గిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.