Vanilla Cupcake:Oven లేకుండా బేకరీ స్టైల్ కప్ కేక్స్ ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు
Vanilla Cupcake:వెనీలా కప్ కేక్..కేక్స్ బేకరీ ఐటెమ్స్ ఇష్టపడే పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు.వెనీలా కప్ కేక్స్ చిటికిలో తయారు చేసుకోవచ్చు.ఎలాగో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
మైద – 1 కప్పు
చక్కెర – ¾ కప్పు
గుడ్లు – 3
నూనె – ½ కప్పు
పాలు – ½ కప్పు
వెనిలా ఎసెన్స్ – 1 టీ స్పూన్
బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్
ఉప్పు – ¼ టీ స్పూన్
తయారీ విధానం
1.ప్రెజర్ కుక్కర్ లో అడుగున ఒక కప్పు ఉప్పు కాని లేదా ఇసుక వేసి వేడిచేయాలి.
2.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి మైదా,బేకింగ్ పౌడర్,సోడియం బై కార్బోనేట్,వేసి బాగా కలుపుకోవాలి.
3.వేరొక గిన్నెలో గుడ్లను వేసి బాగా బీట్ చేసుకోవాలి.
4.కప్పు నూనె వేసి బాగా గుడ్లను బీట్ చేసుకోవాలి.
5.చిటికెడు ఉప్పు,వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకున్నాక కొద్ది కొద్దిగా మైదా పిండి మిశ్రమాన్ని యాడ్ చేస్తు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి.
5.అందులోకి సగం కప్పు పాలు వేసి కేక్ బ్యాటర్ కన్ సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి.
6.ఇప్పుడు కేక్ కప్పులను తీసుకోని లోపలి భాగంలో ఆయిల్ స్ప్రెడ్ చేసి కేక్ మిశ్రమాన్ని సగం కన్నా తక్కువగా వేసుకోవాలి.
7.ముందుగా వేడి చేసుకున్న కుక్కర్ లో అడుగున ఉప్పు కాని ,ఇసుక కాని వేసి వేడి చేసిన కుక్కర్లో అడుగును స్టాండ్ అమర్చి కేక్స్ కప్పుల ప్లేట్ ని ఉంచాలి.
8.మూడు నిమిషాలు పదిహేను నుంచి ఇరువై నిమిషాలు లోఫ్లేమ్ పై బేక్ చేసుకోవాలి.
9.టూత్ పిక్ తో ఉడికిందోలేదో చెక్ చేసుకోని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి.
10.కేక్ కప్పు లను ట్యాపింగ్స్ తో అలంకరించుకుంటే సరిపోతుంది.