Egg Semiya Upma:కేవలం 10 నిమిషాల్లో నోరూరించే ఎగ్ సేమియా ఉప్మా..రుచి చూస్తే ఎవ్వరైనా ఫిదా …
Egg semiya Upma:ఎగ్ సేమియా ఉప్మా..ఉప్మా అంటే చాలామందికి బోర్ టిఫిన్ లా ఫీలౌవుతారు.ఉప్మాని కూడ ఇంట్రెస్టింగ్ తినాలి అంటే ఎగ్ మిక్స్ చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
వెర్మిసిల్లి – 2 కప్పులు
గుడ్లు – 3
ఉల్లిపాయలు – ½ కప్పు
కరివేపాకు – ½ కప్పు
పచ్చిమిర్చి – 5
కొత్తిమీర – ½ కప్పు
జీలకర్ర – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఐదు నుంచి ఆరు కప్పుల నీళ్లను పోసి 1 స్పూన్ ఆయిల్ వేసి మరిగించండి.
2.ఎసరు మరిగినప్పుడు వెర్మిసిల్లి వేసి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి.
3.ఉడికిన వెర్మిసిల్లిని జల్లిబుట్టలో వేసుకోని చల్లని నీరు పోయాలి.
4.ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,ఆవాలు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,వేసి వేపుకోవాలి.
5.రుచికి సరిపడా ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి మూడు గుడ్లు వేపి కలుపుకోవాలి.
7.గుడ్లు పూర్తిగా ఉడికిన తర్వాత గరంమాసాల,కొత్తిమీర తరుగు ,ఉడికించిన వెర్మిసిల్లి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే ఎగ్ వెర్మిసిల్లి సేమియా రెడీ.