Movies

Guess the actress:ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా.. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..!

Tollywood Heroine laila:కొందరు హీరోయిన్స్ వస్తారు కొన్ని మూవీస్ చేసినా ఎక్కువ పేరు తెచ్చుకుని తెరమరగవుతారు. వాళ్ళని ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేం.

అందులో ముఖ్యంగా అప్పట్లో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఎగిరే పావురమా అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన నటి లైలా ఒకరు. నిజానికి ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

లైలా తెలుగులో కొన్ని చిత్రాల లోనే నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మాత్రం బానే మెప్పించింది. తన నటనతో మురిపించింది. తెలుగులో లైలా నటించిన మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, ఎగిరే పావురమా, పవిత్ర ప్రేమ తదితర చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

అంతేగాక లైలా తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ తదితర భాషలలో కూడా నటించింది.కాగా ఒకానొక సమయంలో చేతి నిండా వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్న సమయంలోనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి అనంతరం లైలా సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

ప్రస్తుతం లైలా కి ఇద్దరు పిల్లలు ఉన్నారు.దీంతో లైలా ఒక పక్క తన కుటుంబ బాధ్యతలు చక్కబెడుతూ మరోపక్క తన భర్తకి వ్యాపారాల్లో సాయం చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అయితే ఇటీవలే తమిళ సినీ పరిశ్రమ నుంచి కొన్ని సినీ ఆఫర్లు వస్తే, లైలావాటిని సున్నితంగా తిరస్కరించిందట.