Kitchen

Kitchen Tips:రోజూ పాలు పొంగిపోతున్నాయా? ఈ టిప్స్ తో ఒక్క చుక్క కూడా కిందపడదు..

Kitchen tips in Telugu: వంట చేసే సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే వంట తొందరగా అవుతుంది. వంటింటిలో కొన్ని పనులను చేసినప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే పని తొందరగా అవుతుంది. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

పాలను కాగపెట్టే సమయంలో పాలు ఎక్కువగా పొంగి పొయ్యి, కిచెన్ ప్లాట్‌ఫారమ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతానికి చేరతాయి. దాంతో వంటగది శుభ్రం చేయటానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఈ సమస్య మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. పాలు కాగపెట్టినప్పుడు పొంగకుండా ఉండాలంటే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఇది కూడా చూడండి – ఇంత వరకు ఎవరూ చెప్పని కొత్త వంటింటి చిట్కాలు…ముందే తెలిస్తే .

పాలు వేడి చేయడానికి ఎంచుకున్న పాత్రను తీసుకొని దాని అంచుల వద్ద కొద్దిగా నూనె రాయండి. ఇలా గిన్నె అంచులకు నూనె రాయడంతో పాలు ఎంత మరిగిన గిన్నె ఉపరితలం దాటకుండా చేస్తుంది.

పాలు గిన్నె లోపల మాత్రమే మరుగుతాయి. ఇంట్లో చెక్క గరిటె ఉంటె.. ఆ చెక్క గరిటెను తీసుకుని పాలు మరిగించే గిన్నె మీద అడ్డంగా పెట్టండి. అప్పుడు పాలు మరిగిన అవి గిన్నె దాటి పొంగకుండా ఆ చెక్క గరిటె నిరోధిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.