Seeds for weight loss: ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా..? ఈ విత్తనాలు తింటే వెయిట్ లాస్ అవుతారు..!
flax seeds in telugu :అధిక బరువు అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేదిస్తుంది. ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా అధిక బరువు అనేది ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా మారిపోయింది. అధిక బరువు సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయి.
అందుకే అధిక బరువు సమస్యలను తగ్గించుకోవడానికి చాలా గట్టి ప్రయత్నం చేయాలి. చాలా మంది డైటింగ్ వ్యాయామం వంటి ఎన్నో రకాల చేస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గించడానికి కొన్ని ఆహారాలు బాగా సహాయపడుతాయి.
వాటిలో అవిసె గింజలు ఒకటి. అవిసె గింజలు డైరెక్ట్ గా తీసుకుంటే అరగవు. అలాగే మన శరీరం పోషకాలను గ్రహించలేదు. కాబట్టి అవిసె గింజల పొడి తయారు చేసుకొని తీసుకోవచ్చు లేదా రాత్రి సమయంలో flax seeds నానబెట్టి మరుసటి రోజు వాటిని మొలకలు తయారీ చేసుకొని తీసుకోవాలి.
ఇలా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. రాత్రి సమయంలో flax seeds నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితం కనబడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.