Healthhealth tips in telugu

Gas and Bloating:నిమిషంలో గ్యాస్,అజీర్ణం,కడుపు ఉబ్బరం సమస్యలు మాయం

Home remedies for gastric problem in telugu :ఈ మధ్య కాలంలో తీసుకొనే ఆహారం, ఎక్కువగా మసాలా ఉన్న ఆహారం తీసుకోవటం, వేళకు ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో గ్యాస్ సమస్యతో ప్రతి ఒక్కరూ ఎదో ఒక సమయంలో ఇబ్బంది పడుతున్నారు.

గ్యాస్ సమస్య అనేది ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపు నిండిన అనుభూతి ఉండడం.. తిమ్మిరి ఇలా ఉంటూనే గుండె దగ్గర మంటగా ఉంటుంది.

వైద్యపరంగా అపానవాయువు(ఫ్లాట్యులెన్స్) అని వీటిని పిలుస్తురు. ఇది మీ జీర్ణ వ్యవస్థలో అదనపు వాయువుని కలిగి ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అరస్పూన్ వాములో చిటికెడు ఉప్పు వేసి నోటిలో వేసుకొని నమిలి మింగాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. వాములో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ రసాలను విడుదల చేస్తుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.