Kidney stones:కిడ్నీలో రాళ్ళను కరిగించే అద్భుతమైన ఆకు…మీకు తెలుసా ?
kondapindi aaku uses :మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి అయితే ఆ మొక్కల గురించి మనకు పెద్దగా తెలీదు పల్లెటూరి లో ఉండే వారికి చుట్టు పక్కల ఉండే మొక్కలు గురించి బాగా తెలుస్తుంది అలా మన ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి ఇప్పుడు చెప్పే ఈ మొక్క కిడ్నీలో రాళ్లను కరిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది
ఈ మొక్కnu ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతున్నారు ఈ మొక్క ఆకుల పొడిని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు అంతే కాకుండా ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ లో కూడా అమ్ముతున్నారు కిడ్నీలో రాళ్ల సమస్య ఉందంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఆ బాధను భరించలేక వేలకొద్ది డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు.
కొంతమంది మందులు వాడుతూ కిడ్నీలో రాళ్ళను కరిగించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే ఈ ఆకులు ఉపయోగిస్తే కిడ్నీలో రాళ్లు ఆపరేషన్ లేకుండా కరిగిపోతాయి ఈ ఆకు పేరు కొండపిండి ఆకు. కొండలనయినా పిండి చేయగలదనే నమ్మకంతో మన పూర్వీకులు దీనికి కొండ పిండి ఆకు,పాషాన భేధి,తెలగపిండి ఆకు అనే పేర్లు పెట్టారు.
ఈ ఆకులను కిడ్నీ సమస్యలు తో భాధ పడేవారు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్య నుండి బయటపడవచ్చు.ఈ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు.
ఆకులు దొరకని వారు ఆయుర్వేదం షాప్ లో దొరికే కొండపిండి ఆకు పౌడర్ తెచ్చుకుని ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ వేసి మరిగించి వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి ఈ విధంగా 20 రోజుల పాటు తాగితే కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి కొండపిండి ఆకు ను పప్పుగా తయారు చేసుకొని కూడా తినవచ్చు. ఈ ఆకు తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.