Weight Loss Tips:ఎటువంటి డైట్,వ్యాయామం చేయకుండా నెలలో 5 కేజీలు బరువు తగ్గించే డ్రింక్
Fenugreek seeds Weight Loss Tips In telugu :ఈ రోజుల్లో అధిక బరువు సమస్య ఎన్నో రకాల ఇబ్బందులు తీసుకొస్తోంది శరీరంలో కొవ్వు పేరుకుపోవటం వల్ల గుండె సమస్యలే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి బరువు తగ్గించుకోవటానికి మన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి.
ప్రతి రోజు ఇప్పుడు చెప్పే డ్రింక్ తయారు చేసుకుని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది.ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక లీటర్ నీటిని పొయ్యి మీద పెట్టి ఒక బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు,ఒక స్పూన్ నల్ల జీలకర్ర ఒక స్పూన్ సోంపు, ఒక యాలక వేసి పది నిమిషాలపాటు బాగా మరిగించాలి ఈ విధంగా మరిగించటం వలన మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ లోని పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి
ఈ నీటిని వడగట్టి ఒక నిమ్మచెక్క రసాన్ని పిండి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ డ్రింక్ ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రతిరోజు టిఫిన్ చేసిన అరగంట తర్వాత,మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తర్వాత, రాత్రి డిన్నర్ తీసుకున్న అరగంట తర్వాత తాగాలి.
పరగడుపున ఈ డ్రింక్ తాగకూడదు తాగితే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజులో మూడుసార్లు ఈ డ్రింక్ తీసుకుంటూ నెల రోజుల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మంచి పోషకాహారం తీసుకుంటూ ఉంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి నెలలో దాదాపుగా 5 కేజీల బరువు తగ్గుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.