Beauty Tips

Pink Lips: ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు.. మీ పెదవులు అందంగా, లేత గులాబీ రంగులో మెరుస్తాయి!

pink lips Home remedies :ఈ సీజన్ లో చాలా మందికి పెదాలు నల్లగా మారి పొట్టు రాలుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో జీవం కోల్పోయి పెదాలు పగిలి నల్లగా మారి ఒక్కోసారి పెదాల నుండి నొప్పి, రక్తం కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువగా నీటిని తాగాలి. అలాగే ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే కావలసిన తేమ అంది పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.

ఫిగ్మెంటేషన్ తొలగిపోయి గులాబీ రంగులోకి మారతాయి. దీని కోసం ఒక్క బౌల్ లో ఒక స్పూన్ వాసెలిన్, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని సీసాలో నిల్వ చేస్తే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు పెదాలకు రాసి 5 నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఈ విధంగా చేయటం వలన పెదాలు పొడిగా లేకుండా తేమగా ఉంటాయి. ఎప్పుడు పెదాలు తేమగా ఉండేలా చూసుకోవాలి. పెదాలు పొడిగా మారితేనే సమస్యలు వస్తాయి. అలాగే రోజులో సరిపడా నీటిని తాగుతూ ఉండాలి. ఇక తేనె విషయానికి వస్తే నేచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటానికి ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. కాకపోతే కాస్త ఓపిక,సమయం ఉండాలి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.