Movies

Super star Krishna:కృష్ణ తెలుగు తెరకు పరిచయం చేసిన హీరోయిన్స్ ఎంత మంది ఉన్నారో…?

Super Star Krishna Heroines:సూపర్ స్టార్ కృష్ణ గారు తన సినిమాలలో కొంత మంది హీరోయిన్ల ను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం. మొట్టమొదటగా కిలాడి కృష్ణుడు సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి గారిని తెలుగుతెరకు పరిచయం చేశారు.

అదేవిధంగా రక్త తర్పణం తెలుగు సినిమా ద్వారా బాలీవుడ్ నటి వర్ష తెలుగుతెరకు పరిచయం చేశారు. కృష్ణగారి మరొక సినిమా యస్ నేనంటే నేనే సినిమా ద్వారా మరొక అందమైన బాలీవుడ్ నటి షాహిన్ ను తెలుగు తెరకు పరిచయం చేసారు.

నా ఇల్లే నా స్వర్గం అనే సినిమా ద్వారా బెంగాలీ నటి రూపా గంగూలీ ని తెలుగు తెరకు పరిచయం చేశారు. సింహాసనం అనే చిత్రం ద్వారా మందాకిని అనే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల ద్వారా పరిచయమైన హీరోయిన్స్ ఎవరో తెలుసుకున్నారుగా.