MoviesTollywood news in telugu

Tollywood:ఫాన్స్ ని కూడా తలెత్తుకోకుండా చేసిన హీరోల సినిమాలివే

Tollywood Movies:కొన్ని సినిమాలు వివిధ కారణాల వలన ప్లాప్ అవుతాయి. షూటింగ్ లేటవ్వడం,కథలో పట్టులేకపోవడం,మార్పులు చేర్పులు ఇలా ఎన్నో కారణాల వలన కూడా ప్లాప్ అవుతాయి. కానీ హీరో ఇమేజ్ ని పూర్తిగా డామేజ్ చేసేలా ఉన్న క్యారెక్టర్స్ ని ఒప్పుకుని ప్లాప్ అవ్వడం చూస్తే అది అభిమానులకు తలెత్తుకోలేని స్థితి గా ఉంటుంది.

అలాంటి సినిమాల విషయానికి వస్తే, దాదాపు అందరి హీరోలకు ఇలాంటి మూవీస్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి రిక్షావోడులో చేసిన రిక్షావాడి క్యారెక్టర్ ఫాన్స్ కి నచ్చలేదు. అలాగని రెండో క్యారెక్టర్ కూడా నచ్చలేదు. అందుకే డిజాస్టర్ అయింది.

ఇక మృగరాజు మూవీని కూడా ఫాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో బాలయ్య నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ అవ్వడం చిరు ఫాన్స్ బాధ తట్టుకోలేకపోయారని అప్పట్లో టాక్.ఇక నందమూరి నటసింహం బాలయ్య 1997లో వచ్చిన దేవుడు మూవీ లో డిఫరెంట్ క్యారెక్టర్ కాస్తా నవ్వులపాలైంది. పల్నాటి బ్రహ్మనాయుడులో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లే సీన్ లాంటివి సినిమాను డిజాస్టర్ చేశాయి.

విజయేంద్రవర్మ,ఒక్క మగాడు,పరమవీర చక్ర,తాజాగా రూలర్ మూవీస్ బాలయ్య కెరీర్ లో డిజాస్టర్స్. ఈ సినిమాల్లో గెటప్స్ ట్రోలింగ్ కి గురయ్యాయి. కింగ్ నాగార్జున చేసిన బావ నచ్చాడు మూవీ తలపోటు మిగిల్చిందని ఫాన్స్ బాధపడ్డారు. ఇక కేడి సినిమాలో నాగ్ ని చూసి ఇదే పాత్ర రా బాబు అని ఫాన్స్ గగ్గోలు పెట్టారు. భాయ్ మూవీ ,ఇటీవల మన్మధుడు 2సినిమాలు కూడా బోల్తా కొట్టించి, ట్రోల్స్ కి గురయ్యాయి.

ఇక వెంకటేష్ విషయానికి వస్తే, సుభాష్ చంద్రబోస్ ,షాడో మూవీస్ వెంకీ ఫాన్స్ కి బాధను మిగిల్చాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొమరం పులి మూవీతో ఫాన్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ కూడా తీవ్రంగా ట్రోల్ కి గురయ్యింది. ఇక అజ్ఞాతవాసి విపరీతంగా ట్రోల్ కి గురయ్యింది. ఇక ఇప్పటి స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నాని మూవీ ఫాన్స్ కి పీడకల మిగిల్చింది.

అయితే ఇటీవల వచ్చిన బ్రహ్మోత్సవం కూడా అలాంటి పీడకలను మిగిల్చింది. చిన్నతనంలో హిట్స్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసిన కొన్ని కథలు దారుణ డిజాస్టర్ మిగిల్చాయి. ఆంధ్రావాలా పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ ట్రోల్ కి గురయ్యింది. నా అల్లుడు,శక్తి,రభస మూవీస్ చూస్తే అసలు ఈ సినిమాలేంటో, క్యారెక్టర్స్ ఏమిటో అన్నట్టు ఉంటాయి. అందుకే ఘోరంగా దెబ్బతినేసాయి.

రవితేజ ఖతర్నాక్,అమర్ అక్బర్ అంథోని మూవీస్ దారుణంగా ఫాన్స్ ని ఇబ్బంది పెట్టాయి. అల్లు అర్జున్ వరుడు మూవీ ఫాన్స్ కి పరీక్షగా నిలిస్తే, రామ్ చరణ్ హిందీ డబ్బింగ్ తుపాన్ మూవీ విపరీతంగా ట్రోల్ అయింది.