Garlic:రోజు పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే… శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
Empty Stomach Garlic Health benefits in Telugu : మనలో చాలా మంది వెల్లుల్లిని వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. వంటలలో వెల్లుల్లిని వాడటం వలన వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి.
వెల్లుల్లి తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొంతమంది వెల్లుల్లి వాసన కారణంగా తినడానికి ఇష్టపడరు. అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పకుండా తినడానికి ప్రయత్నం చేస్తారు.
ప్రతి రోజూ ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ని బలపరిచి ఇన్ఫెక్షన్స్, వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
ముఖ్యంగా సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటివి రాకుండా కాపాడుతుంది.డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. రక్త సరఫరా బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
మెదడు యాక్టివ్ గా మారి మతి మరుపు తగ్గి ఏకాగ్రత., జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున వెల్లుల్లి రెబ్బలను తినకూడదు. అలాంటి వారు బ్రేక్ ఫాస్ట్ అయ్యాక తినవచ్చు. వెల్లుల్లిని పచ్చిగా తినడం కష్టంగా ఉందంటే వెల్లుల్లిని క్రష్ చేసి రసం తీసి దానిలో తేనె కలుపుకొని తీసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.