Onion Juice For Hair Care:జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఊడిన ప్రదేశంలో కొత్త జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది
Hair Fall Tips In telugu :జుట్టుకి సంబందించిన సమస్యలు తగ్గాలంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. జుట్టు రాలే సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనపడుతుంది.
జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
అలా కాకుండా ఇంటి చిట్కాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. దీని కోసం జామ ఆకులు, ఉల్లిపాయ, మెంతులు ఉపయోగిస్తున్నాం. పొయ్యి మీద గిన్నె పెట్టి 4 జామ ఆకులను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తొక్కలు తీయకుండా ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులను వేసి బాగా 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.
మరిగిన ఈ నీటిని వడకట్టి తలకు పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది. జామ ఆకులలో ఉండే విటమిన్ బి జుట్టు రాలకుండా ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. అలాగే యాంటి మైక్రోబియల్ లక్షణాలు తల మీద చర్మాన్ని శుభ్రం చేస్తాయి.
జామ ఆకుల్లో ఉండే విటమిన్ సి అనేది కొల్లజన్ యాక్టివిటీ మెరుగుపరిచి జుట్టు ఎలాస్టిసిటీ ని పెంచుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు రాలటానికి కారణం అయిన చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. ఉల్లిపాయ జుట్టు సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
మెంతుల్లో ఉండే ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు బలంగా, ఆరోగ్యంగా,ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. మెంతులు చుండ్రును తగ్గించటానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. mentulu కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.