Kitchenvantalu

Udupi Sambar: ఉడుపి స్టైల్లో సాంబార్ ఇలా చేశారంటే లొట్టలేసుకొని తింటారు..

Udupi Style Beerakaya Sambar prepare: వారానికి ఒక్కసారైనా సాంబార్ కచ్చితంగా ఇంట్లో వండాల్సిందే. దక్షిణ భారతదేశంలో సాంబార్ ఫేమస్ వంటకం. దక్షిణభారతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంబార్ ను ఒక్కో స్టైల్ లో చేస్తారు. ప్రతి స్టైల్ లోనూ సాంబార్ అదిరిపోవాల్సిందే.
సాంబార్ అనగానే, మొలకాడలు ,సొరకాయలు అన్ని కూరగాయులు వేసేసుకుంటాం. కాని, బీరకాయతో చేసిన సాంబార్, ఎప్పుడైనా టేస్ట్ చేసారా.. ఉడిపి స్టైల్ బీరకాయ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సాంబార్ పేస్ట్ కోసం..
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
మిరపకాయలు – 7
గుంటూరు మిర్చి -8
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
యాలకులు -2
లవంగాలు – 3
దాల్చిన చెక్క – 1 ఇంచ్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చికొబ్బరి ముక్కలు – 1/2కప్పు
గసగసాలు – 1 టీ స్పూన్

పప్పు ఉడికించడానికి..
కందిపప్పు – 1/2కప్పు
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
నీళ్లు – 1.5 కప్పు

బీరకాయ ఉడికించుకోవడానికి..
బీరకాయ ముక్కలు – 300 గ్రాములు

సాంబార్ కోసం..
నూనె – 1 టేబుల్ స్పూన్
మెంతులు – చిటికెడు
ఆవాలు – 1/2టీస్పూన్
ఇంగువ – 2 చిటికెలు
కరివేపాకు – 2 రెబ్బలు
చింతపండు పులుసు – 300ml
నీళ్లు – 750ml
ఉప్పు – తగినంత

తాళింపు కోసం
నూనె – 2 టేబుల్ స్పూన్స్
పల్లీలు – 4 టేబుల్ స్పూన్స్
ఆవాలు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.నానపెట్టుకున్న కందిపప్పులో, ఉప్పు, పసుపు, నీళ్లు పోసుకుని, కుక్కర్ మూత పెట్టి, మెత్తగా ఉడికించుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని, సాంబార్ పేస్ట్ కోసం, తీసుకున్న పదార్థాలు అన్ని, ఒకోక్కటిగా, వేపుకోవాలి.
3.వేయించుకున్న పదార్ధాలు అన్ని, మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
4. ఇప్పుడు బీరకాయను , చేదు లేకుండా చూసుకుని, చెక్కు తీసుకుని, రెండు కప్పుల నీళ్లు పోసి, 80 శాతం వరకు ఉడికించి పక్కనపెట్టుకోవాలి.
5. ఇప్పుడు సాంబార్ కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకుని, నూనె వేడి చేసి, మెంతులు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, వేసుకుని, వేపుకోవాలి.

6. వేగిన తాళింపులో టమాటో ముక్కలు వేసి, మరో నిముషం వేపి, చింతపండు పులుసు వేసి, ఒక పొంగు రానివ్వాలి.
7. మరుగుతున్న పులుసులో సాంబార్ పొడి ముద్ద, కందిపప్పు ముద్ద, ఉప్పు, ఉడికించిన బీరకాయ, నీళ్లు, ఉప్పు, బెల్లం వేసి, కలిపి మూత పెట్టి, 20 నిముషాలు మరగనివ్వాలి.
8. తాళింపు కోసం నూనె వేడి చేసి, అందులోకి, పల్లీలు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, వేసి, చివరగా కొత్తిమీరను వేసి, వేపుకున్న తాళింపును సాంబార్లో కలుపుకోవాలి.
9. తాళింపు కలుపుకున్న సాంబార్ను ఒక నిముషం పాటు మరగనిచ్చి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u