Childhood Pic:ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా… ?
Sai Dharam Tej:మెగా హీరో సాయి ధరమ్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర ఫోటో పంచుకున్నారు. రెండు మూడేళ్ళ వయసులో ఉన్న ధరమ్ తేజ్ కి ఏదో సందర్భంలో వాళ్ళ అమ్మగారు ఆడ వేషం వేశారు. ఆ అరుదైన ఫోటోని ధరమ్ తేజ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఫ్యాన్స్ దానిని వైరల్ చేసారు.
ఇక ధరమ్ ప్రతిరోజూ పండగే చిత్రంతో ట్రాక్ లోకి వచ్చారు. మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం బంపర్ హిట్ అందుకుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ ఫన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ధరమ్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించింది.
ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఆ తర్వాత చేసిన Virupaksha, పవన్ కళ్యాణ్ తో చేసిన Bro సినిమాలు విజయం సాధించాయి. ఆ జోష్ తో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.