దోమలను క్షణాల్లో మాయం చేసే అద్భుతమైన చిట్కా
Domalu povalante em cheyali telugu : దోమల బెడద కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. దోమలు కనపడగానే అందరు మస్కిటో కొయిల్స్ వెంట పడతారు. వాటి వలన కొన్ని సైడ్ ఎఫక్ట్స్ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి దోమలను ఇంటి నుండి తరిమి కొట్టవచ్చు.
దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అన్ని మనకు అందుబాటులో ఉండేవే.దోమలు కుట్టాయంటే దద్దుర్లు వచ్చి నొప్పి మంట వంటివి వస్తాయి. దీని కోసం ఒక పొడిని తయారుచేసుకోవాలి.
వేపాకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. వేపాకుల పొడి మార్కెట్ లో కూడా దొరుకుతుంది. కానీ ఇంటిలో తయారుచేసుకుంటేనే మంచిది. ఒక బౌల్ లో 2 స్పూన్ల వేపాకుపొడి, ఒక స్పూన్ ఉప్పు, అరస్పూన్ అవాల పొడి,ఒక కర్పూరం బిళ్ళను పొడిగా చేసి వేసి కలిపి ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు.
మట్టి మూకుడులో బొగ్గులతో నిప్పులను తయారుచేసి దానిలో తయారుచేసుకున్న పొడిని వేస్తే పొగ వస్తుంది. ఈ పొగకు దోమలు పోతాయి. చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దోమలను తరిమికొట్టవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.