Healthhealth tips in telugu

Chia Seeds For Weight Loss:ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Chia seeds and cinnamon Weight Loss Tips In telugu : అధిక బరువు సమస్య అనేది ఈ రోజుల్లో చాలా సాధారణం అయ్యిపోయింది. బరువు పెరగటం అయితే చాలా తొందరగా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే మాత్రం చాలా సమయం పట్టేస్తుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గాలి. ఒక్క సారిగా తగ్గిపోకూడదు. మంచి పోషకాహారం తీసుకోవాలి.

ఈ రోజు తయారుచేసుకొనే పాలను తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఒక గ్లాస్ లో గోరువెచ్చని పాలను తీసుకోవాలి. దానిలో పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ దాల్చినచెక్క పొడి, పావు స్పూన్ శొంఠి పొడి, పావు స్పూన్ మిరియాల పొడి, అరస్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి. అప్పుడు చియా సీడ్స్ బాగా నాని ఉబ్బుతాయి. వాటిలో పోషకాలు కూడా రెట్టింపు అవుతాయి. ఈ పాలను ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి.

ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే అధిక బరువు తగ్గటమే కాకుండా డయబెటిస్ నియంత్రణ, కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కాస్త శ్రద్ద పెట్టి ఈ పాలను తయారుచేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.