Health Tips:వేగించిన వెల్లుల్లిని తింటున్నారా….శరీరంలో గంట గంటకు వచ్చే మార్పులు
Garlic benefits in Telugu : వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వేగించిన వెల్లుల్లిని తింటే మన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొదటి గంటలో వెల్లుల్లిని శరీరం జీర్ణం చేసుకొని పోషకాలను గ్రహిస్తుంది.
రెండు నుంచి నాలుగు గంటల లోపు – శరీరం గ్రహించిన పోషకాలు శరీరంలోని ఏదైనా క్యాన్సర్ కణాలు మరియు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయ పడతాయి.నాలుగు నుంచి 6 గంటల లోపు – శరీరంలో జీవక్రియ రేటును పెంచుతుంది. అదనపు ద్రవాలను తొలగిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించటం ప్రారంభిస్తుంది.
6 నుంచి 7 గంటల లోపు – వెల్లుల్లి యొక్క యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలు విడుదలవుతాయి. అలాగే రక్తప్రవాహంలో ప్రసరించడం ప్రారంభిస్తాయి. వెల్లుల్లి శరీరంలోని బ్యాక్టీరియాపై పనిచేయడం ప్రారంభిస్తుంది.
6 నుంచి 10 గంటల లోపు – వెల్లుల్లిలో ఉండే పోషకాలు శరీరానికి సెల్యులార్ స్థాయిలో సహాయపడతాయి. అలాగే శరీరాన్ని ఆక్సీకరణం నుండి కాపాడతాయి. 10 నుంచి 24 గంటల లోపు – వెల్లుల్లి కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ధమనులను శుభ్రపరచడం మరియు గుండె సమస్యల నుండి రక్షిస్తుంది.
రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచటానికి సహాయపడుతుంది. ఎముకలు మరియు కీళ్లను ఆరోగ్యంగా,బలంగా ఉండేలా చేస్తుంది. అలసట,నిస్సత్తువ లేకుండా ఉషారుగా ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.