Good luck ganesha movie review:’గుడ్ లక్ గణేశా’ (ఆహా) మూవీ రివ్యూ..ఎలా ఉందంటే..
Good luck ganesha movie review:చిన్న బడ్జెట్ తో యోగిబాబు ప్రధాన పాత్రగా ‘గుడ్ లక్ గణేశా’ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు సింపుల్ కంటెంట్ తో సహజత్వానికి పెద్దపీట వేసాడు.
బలమైన సందేశాన్ని ఇచ్చిన కథ.. అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ఛాన్స్ ఉన్న కాన్సెప్ట్ ఇది. వుడిని కూడా మనిషిలానే చూపిస్తూ, మనిషిలో మార్పు తీసుకొచ్చే కాన్సెప్ట్ ఇది. కేవలం ఆరు పాత్రలతో సినిమా నడుస్తూ.. కామెడీని .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ, సందేశం దిశగా ఈ కథ పరిగెడుతుంది.
స్వార్థ బుద్ధి ఉన్న ఒక మనిషిని మార్చటమే ఈ కథ సారంశం. ఒక మనిషిలో మంచి మార్పు రావాలంటే అతని కళ్లముందు కొన్ని సంఘటనలు జరగాలి. కొన్ని అనుభవాలు ఎదురుకావాలి. అలాంటివాటిని సృష్టించేది కూడా ఆ దేవుడే అనే విషయాన్ని ఆవిష్కరించిన కంటెంట్ ఇది.
ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఒకసారి చూడవచ్చు. గణేషతో చాలా సినిమాలు వచ్చిన ఈ సినిమా మాత్రం మానవత్వానికి మించిన మంత్రం లేదని చెప్పుతుంది.
కామెడీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ సినిమాలో యోగిబాబు, రమేశ్ తిలక్, ఊర్వశి, కరుణాకరన్, ఉదయ్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమారు రజీశ్ మిథిలా దర్శకత్వం వహించారు. భరత్ శంకర్ సంగీతం అందించారు. ఈ సినిమాను గ్రేట్ ఇండియన్ సినిమాస్ బ్యానర్ పై రజీష్ మిథిలా, లిజో జోన్స్ నిర్మించారు.