Ayodhya ram lalla statue: అయోధ్య బాల రాముడి విగ్రహం ప్రత్యేకతలివే..!!
Ayodhya ram lalla statue: ప్రసుతం దేశంలో ఎక్కడ చూసిన శ్రీరామ నామ జపాన్ని చేస్తున్నారు. జనవరి 22 న ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 22 న ప్రాణ ప్రతిష్ఠ జరిగాక 23 న భక్తులకి దర్శనం ఇస్తారు.
ఇప్పటికే అయోధ్య రామ మందిరం గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. కళ్ళకి గంతలు కట్టి ఉన్న బాల రాముడి విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రామ్ లల్లా విగ్రహ ప్రత్యేకతలు గురించి.. కర్ణాటకకి చెందిన అరుణ్ యోగి రూపొందించిన ఈ విగ్రహం 51 అంగుళాల ఎత్తు.. 200 కిలోల బరువు ఉంటుంది. ఈ బాల రాముని విగ్రహం చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు.
చేతిలో బంగారు బాణం, బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా..రాముడి విగ్రహం చుట్టూ విష్ణు మూర్తి దశావతారాలు ఉన్నాయి. వాటితో పాటు విగ్రహం దిగువున ఒకవైపు హనుమంతుడు మరొక వైపు గరుడ దేవుడు ఉన్నాడు. తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది. రాముడు విష్ణు మూర్తి ఏడో అవతారంగా చెప్తారు.
అంతేకాకుండా సూర్య భగవానుడు, శంఖం, స్వస్తిక్, సుదర్శన చక్రం, గద, ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి. ఈ విగ్రహం తయారికి ఒకే రాయిని ఉపయోగించి ఏకశిలా విగ్రహంగా రూపొందించారు.